Skip to content
యోబు 38:22-38

యోబు 38:22-38

22
“మంచు నిల్వ ఉండే స్థలాలకు నీవు వెళ్లవా? వడగండ్లు నిల్వ ఉండే స్థలాలను నీవు చూశావా?
23
వాటిని నేను కష్టకాలం కోసం, యుద్ధం కోసం యుద్ధ దినాల కోసం దాచిపెట్టాను.
24
వెలుగు విభజించబడే చోటుకు మార్గం ఏది? తూర్పుగాలులు ఎక్కడ నుండి వచ్చి భూమంతటా వ్యాపిస్తాయి?
25
ఎవరూ నివసించని భూమికి, మనుష్యులే నివసించని ఎడారికి నీరు పెట్టడానికి, పాడైపోయిన బీడుభూమిని తృప్తిపరచి అందులో లేతగడ్డి మొక్కలను ఎవరు మొలిపిస్తున్నారు? కుండపోతగా కురిసే వర్షానికి ఎవరు కాలువలు ఏర్పాటు చేశారు? ఉరుములు మెరుపులకు ఎవరు మార్గమేర్పరిచారు?
28
వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను ఎవరు పుట్టిస్తారు?
29
ఎవరి గర్భం నుండి మంచుగడ్డ వచ్చింది? పైనుండి దిగివచ్చే మంచును ఎవరు పుట్టించారు?
30
నీళ్లు రాయిలా ఎప్పుడు గడ్డకట్టుకుపోతాయి, లోతైన నీళ్ల ఉపరితలం ఎప్పుడు గట్టిపడుతుంది?
31
“కృత్తిక నక్షత్రాలను నీవు సంకెళ్ళతో బంధించగలవా? మృగశీర్ష నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా?
32
నక్షత్ర రాశులను వాటి వాటి కాలాల్లో వచ్చేలా నీవు చేయగలవా? సప్తరుషి నక్షత్రాలను వాటి ఉప నక్షత్రాలను నీవు నడిపించగలవా?
33
ఆకాశం యొక్క చట్టాలు నీకు తెలుసా? నీవు భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయగలవా?
34
“నిన్ను నీటి వరదతో కప్పి వేయమని నీ స్వరాన్ని ఎత్తి నీవు మేఘాలకు చెప్పగలవా?
35
నీవు మెరుపులను వాటి మార్గాల్లో పంపుతావా? మేము ఇక్కడ ఉన్నాము అని అవి నీతో చెప్తాయా?
36
హృదయానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? మనస్సుకు వివేచన కలిగించింది ఎవరు?
37
దుమ్ము గట్టిగా మారినప్పుడు మట్టిగడ్డలు ఒకదాన్ని ఒకటి అతుక్కున్నప్పుడు మేఘాలను లెక్కించు జ్ఞానం ఎవరికుంది? ఆకాశపు నీటి పాత్రలను బోర్లించగలరు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options