Skip to content
యోబు 21:7-13

యోబు 21:7-13

7
దుష్టులు ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు, పెద్దవారిగా ఎదుగుతూ వారు బలాభివృద్ధి చెందుతున్నారు?
8
తమ పిల్లలు స్థిరపడడం వారు చూస్తారు, వారు మనవళ్ళుమనవరాళ్లతో ఆనందిస్తారు.
9
వారి ఇళ్ళు భయం లేకుండ క్షేమంగా ఉన్నాయి; దేవుని శిక్షాదండం వారి మీదికి రాలేదు.
10
వారి ఎద్దులు సంతానోత్పత్తిలో ఎప్పుడూ విఫలం కావు; వారి ఆవులు దూడలను ఈనుతాయి గర్భస్రావం చేయవు.
11
వారు తమ పిల్లలను మందగా పంపిస్తారు; వారి చిన్నారులు నాట్యమాడతారు.
12
కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు.
13
వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options