యోబు 21:1-6
1
అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2
“నేను శ్రద్ధగా వినండి; ఇదే మీరు నాకిచ్చే ఓదార్పు అవనివ్వండి.
3
నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఓర్చుకోండి, నేను మాట్లాడిన తర్వాత, మీరు ఎగతాళి చేయవచ్చు.
4
“నేను మనుష్యులకు ఫిర్యాదు చేశానా? అలాంటప్పుడు నేను ఎందుకు ఆతురపడకూడదు?
5
నా వైపు చూసి నివ్వెరపోండి; మీ నోటిమీద చేయి వేసుకోండి.
6
దీని గురించి ఆలోచించినప్పుడు, నేను హడలిపోతున్నాను; నా శరీరంలో వణుకు పుడుతుంది.
Settings