Skip to content
యోబు 19:1-9

యోబు 19:1-9

1
అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2
“ఎంతకాలం మీరు నన్ను వేధించి మాటలతో నలుగగొడతారు?
3
ఇప్పటికి పదిసార్లు మీరు నన్ను నిందించారు; సిగ్గులేకుండా మీరు నాపై దాడి చేశారు.
4
ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే నా తప్పు నా మీదికే వస్తుంది.
5
మిమ్మల్ని మీరు నా కంటే హెచ్చించుకొని నా మీద నా అవమానాన్ని మోపితే,
6
దేవుడు నాకు అన్యాయం చేశారని నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.
7
“నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు; సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు.
8
నేను దాటకుండా ఆయన నా దారిని మూసివేశారు; నా త్రోవలను చీకటితో కప్పివేశారు.
9
ఆయన నా గౌరవాన్ని తొలగించారు. నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options