యోబు 18:15-21
15
అగ్ని వారి గుడారంలో నివసిస్తుంది. వారి నివాసం మీద మండే గంధకం చెదిరిపోతుంది.
16
క్రింద వారి వేర్లు ఎండిపోతాయి పైన వారి కొమ్మలు వాడిపోతాయి.
17
భూమి మీద వారి జ్ఞాపకం నశించిపోతుంది; నేలమీద వారి పేరే ఉండదు.
18
వెలుగులో నుండి చీకటిలోకి వారు నడిపించబడతారు లోకం నుండి వారు తరిమివేయబడతారు.
19
తమ ప్రజల్లో వారికి సంతానం గాని వారసులు గాని ఉండరు, ఒకప్పుడు వారు నివాసమున్న స్థలాల్లో బ్రతికి ఉన్నవారు ఎవరు లేరు.
20
వారి దుస్థితిని చూసిన పశ్చిమ ప్రజలు ఆందోళన చెందుతారు; తూర్పున ఉన్నవారు భయంతో నిండి ఉంటారు.
21
ఖచ్చితంగా దుర్మార్గుల నివాసం ఇలాగే ఉంటుంది; దేవుని ఎరుగనివారి స్థలం కూడా ఇలానే ఉంటుంది.”
Settings