Skip to content
యోబు 18:6

యోబు 18:6

చుట్టుపక్కల సందర్భంతో వచనం 6 చూపబడుతోంది.
3
నీ దృష్టికి మేము ఎందుకు పశువులుగా తెలివితక్కువ వారిగా కనబడుతున్నాము?
4
కోపంలో నిన్ను నీవే ముక్కలు చేసుకున్నవాడవు, నీకోసం భూమంతా విడిచిపెట్టబడాలా? నీకోసం కొండలు వాటి స్థానం తప్పాలా?
5
“దుర్మార్గుల దీపం ఆర్పివేయబడుతుంది; వారి అగ్నిజ్వాలలు మండవు.
6
వారి గుడారంలో వెలుగు చీకటిగా అవుతుంది; వారి దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
7
వారి బలమైన అడుగులు బలహీనపడతాయి; వారి సొంత ఆలోచనలే వారిని పడగొడతాయి.
8
వారి కాళ్లు వారిని వలలోనికి నడిపిస్తాయి; వారు వలలో పడతారు.
9
బోను వారి మడమను పట్టుకుంటుంది; ఉచ్చు వారిని గట్టిగా పట్టుకుంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options