Skip to content
యిర్మీయా 8:4-8

యిర్మీయా 8:4-8

4
“వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘మనుష్యులు పడిపోయినప్పుడు, వారు లేవరా? ఎవరైనా ప్రక్కకు తొలగిపోతే, వారు వెనుకకు తిరిగి రారా?
5
అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు.
6
నేను జాగ్రత్తగా విన్నాను, కానీ వారు సరియైనది చెప్పరు. “నేనేం చేశాను?” అని అంటూ, వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు.
7
ఆకాశంలోని కొంగకు కూడా తన నిర్ణీత కాలాలు తెలుసు, అలాగే పావురం, వేగంగా ఎగిరే పక్షి, ఓదె అనే పక్షులు తమ వలస సమయాన్ని గమనిస్తాయి. అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధులు తెలియవు.
8
“ ‘శాస్త్రుల అబద్ధాల కలం, దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, “మేము జ్ఞానులం, ఎందుకంటే మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options