Skip to content
యిర్మీయా 43:10-13

యిర్మీయా 43:10-13

10
అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: నేను నా సేవకుడును బబులోను రాజైన నెబుకద్నెజరును పిలిపించి, నేను ఇక్కడ పాతిపెట్టిన ఈ రాళ్లపై అతని సింహాసనాన్ని ఏర్పాటు చేస్తాను; అతడు వాటి మీద తన రాజ మండపాన్ని వేస్తాడు.
11
అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు.
12
అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు.
13
అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options