Skip to content
యిర్మీయా 32:6-15

యిర్మీయా 32:6-15

6
యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు నాకు వచ్చింది:
7
నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు.
8
“అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు. “ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు;
9
కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ వెండి తూకం వేసి ఇచ్చాను.
10
నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను.
11
అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను.
12
నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను.
13
“వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను:
14
‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ పత్రాలను, అనగా ముద్ర వేసిన కొనుగోలు పత్రాన్ని, ముద్ర వేయని కొనుగోలు పత్రాన్ని తీసుకుని, అవి చాలా కాలం పాటు ఉండేలా వాటిని మట్టికుండలో దాచిపెట్టు.
15
ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ దేశంలో మళ్ళీ ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options