Skip to content
యెషయా 63:7-14

యెషయా 63:7-14

7
యెహోవా మనకు చేసినదంతటిని బట్టి, యెహోవా కృపలను, యెహోవా స్తుతులను నేను ప్రకటిస్తాను. అవును, ఆయన తన కనికరాన్ని బట్టి, గొప్ప దయను బట్టి ఇశ్రాయేలుకు ఆయన చేసిన అనేక మేలుల గురించి నేను చెప్తాను.
8
ఆయన అన్నారు, “నిజంగా వారు నా ప్రజలు, నాకు నమ్మకంగా ఉండే పిల్లలు”; కాబట్టి ఆయన వారికి రక్షకుడయ్యారు.
9
వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; పూర్వ రోజులన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.
10
అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. కాబట్టి ఆయన వారికి శత్రువయ్యారు తానే వారితో యుద్ధం చేశారు.
11
అప్పుడు ఆయన ప్రజలు పూర్వ రోజులను, మోషేను తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నారు తన మందకాపరులతో పాటు తమను సముద్రంలో నుండి తీసుకువచ్చిన ఆయనేరి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన ఆయనేరి?
12
మోషే కుడిచేతి వైపు మహిమగల తన చేతిని పంపిన ఆయనేరి? తనకు శాశ్వతమైన కీర్తి రాడానికి వారి ఎదుట నీళ్లను విభజించిన ఆయనేరి?
13
మైదానంలో గుర్రం నడిచినట్లు వారు పడిపోకుండా లోతైన జలాల్లో నడిపించిన ఆయనేరి?
14
లోయలోనికి దిగివెళ్లే పశువుల్లా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. మీకు ఘనమైన పేరు రావాలని మీరు మీ ప్రజలను ఇలా నడిపించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options