యెషయా 22:1-11
1
దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు?
2
కల్లోలంతో నిండిన పట్టణమా! కోలాహలం, ఉల్లాసంతో ఉన్న పట్టణమా! నీలో చనిపోయినవారు ఖడ్గం వలన చనిపోలేదు. యుద్ధంలో మరణించలేదు.
3
నీ నాయకులందరు కలిసి పారిపోయారు; విల్లు వాడకుండానే వారు పట్టుబడ్డారు. శత్రువు దూరంగా ఉండగానే పారిపోయిన వారందరిని, మీలో పట్టుబడిన వారందరిని కలిపి బందీలుగా తీసుకెళ్లారు.
4
అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.
5
దర్శనపు లోయలో సైన్యాల అధిపతియైన యెహోవా నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, గోడలు కూలిపోతాయి పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది.
6
ఏలాము రథసారధులతో గుర్రాలతో తన అంబులపొదిని నింపుకుంది. కీరు మనుష్యులు డాలును బయటకు తీశారు.
7
కాబట్టి మీకు ఇష్టమైన లోయల నిండా రథాలు ఉన్నాయి, గుర్రపురౌతులు పట్టణపు గుమ్మాల దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
8
ప్రభువు యూదా నుండి రక్షణ కవచాన్ని తీసివేశారు, ఆ రోజున మీరు అరణ్య రాజభవనంలో ఉన్న ఆయుధాల వైపు చూశారు.
9
దావీదు పట్టణపు గోడలు చాలా స్థలాల్లో పాడైనట్లు చూశారు దిగువన ఉన్న కొలనులో మీరు నీటిని సమకూర్చారు.
10
మీరు యెరూషలేములోని భవనాలను లెక్కపెట్టి గోడను పటిష్టం చేయడానికి ఇళ్ళను పడగొట్టారు.
11
పాత కొలనులో నీటి కోసం మీరు రెండు గోడల మధ్య జలాశయం కట్టారు. కాని దానిని నిర్మించిన వ్యక్తి వైపు మీరు చూడలేదు. పూర్వకాలంలో దానిని ఆలోచించిన వ్యక్తిని మీరు లెక్కచేయలేదు.
Settings