Skip to content
హోషేయ 7:8-16

హోషేయ 7:8-16

8
“ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.
9
విదేశీయులు అతని బలాన్ని లాగేస్తారు, కాని అతడు గ్రహించడు. అతని తలమీద నెరసిన వెంట్రుకలు ఉంటాయి, కాని అతడు గమనించడు.
10
ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు.
11
“ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.
12
వారు వెళ్లేటప్పుడు, నేను వారి మీద నా వల వేస్తాను; నేను వారిని ఆకాశంలో పక్షుల్లా క్రిందికి లాగుతాను. వారు సమాజంగా కూడుకుంటున్నారని నేను విన్నప్పుడు, నేను వారిని శిక్షిస్తాను.
13
వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.
14
వారు తమ హృదయపూర్వకంగా నాకు మొరపెట్టరు, కాని తమ పడకల మీద విలపిస్తారు. ధాన్యం కోసం, నూతన ద్రాక్షరసం కోసం, వారు తమ దేవుళ్ళను వేడుకుంటూ తమను తాము కొట్టుకుంటారు కాని వారు నా నుండి తొలగిపోయారు.
15
నేను వారికి శిక్షణ ఇచ్చి బలపరిచాను, కాని నాకు విరుద్ధంగా దురాలోచన చేస్తున్నారు.
16
వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options