Skip to content
ఆదికాండము 24:1-9

ఆదికాండము 24:1-9

1
అబ్రాహాము చాలా వృద్ధుడయ్యాడు, యెహోవా అతన్ని అన్ని విధాలుగా ఆశీర్వదించారు.
2
అబ్రాహాము తన ఇంట్లో గృహనిర్వాహకుడైన ముఖ్య సేవకునితో, “నీ చేయి నా తొడ క్రింద పెట్టు.
3
నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో నుండి నా కుమారునికి భార్యను తీసుకురావని, నా దేశం, నా బంధువుల దగ్గరకు వెళ్లి వారిలో నుండి నా కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకువస్తావని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేయి” అని అన్నాడు.
5
అందుకు ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ ఈ దేశానికి రావడానికి ఇష్టపడకపోతే ఏం చేయాలి? నీవు వచ్చిన ఆ దేశానికి నీ కుమారున్ని తీసుకెళ్లాలా?” అని అతన్ని అడిగాడు.
6
అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు.
7
నా తండ్రి ఇంటి నుండి, నా స్వదేశం నుండి బయటకు తీసుకువచ్చి, ‘నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను’ అని వాగ్దానం చేసిన పరలోక దేవుడైన యెహోవాయే నా కుమారునికి భార్యను అక్కడినుండి తీసుకువచ్చేలా తన దూతను నీకు ముందుగా పంపుతారు.
8
ఒకవేళ ఆ స్త్రీ నీ వెంట రావడానికి ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి నీవు నిర్దోషివి, కాని నా కుమారున్ని మాత్రం అక్కడికి తీసుకెళ్లకూడదు” అని చెప్పాడు.
9
ఆ సేవకుడు ఈ విషయమై తన యజమానియైన అబ్రాహాము తొడ క్రింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options