Skip to content
యెహెజ్కేలు 7:14-19

యెహెజ్కేలు 7:14-19

14
“ ‘వారంతా సిద్ధపడి యుద్ధానికి బూరలను ఊదుతారు. ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది కాబట్టి వారిలో ఏ ఒక్కరూ యుద్ధానికి వెళ్లరు.
15
బయట కత్తి ఉంది; లోపల తెగులు కరువు ఉన్నాయి. బయట ఉన్నవారు కత్తి వలన చచ్చారు; పట్టణంలో ఉన్నవారు తెగులు కరువు వలన నాశనమవుతారు.
16
వాటినుండి తప్పించుకున్నవారు పర్వతాల మీదకు పారిపోయి తమ పాపాలను బట్టి వారిలో ప్రతి ఒక్కరు లోయ పావురాల్లా మూల్గుతారు.
17
ప్రతీ చేయి బలహీనం అవుతుంది; ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది.
18
వారు గోనెపట్ట కట్టుకుంటారు భయం వారిని ఆవరిస్తుంది. ప్రతి ఒక్కరు సిగ్గుతో తలవంచుకుంటారు, ప్రతి తల క్షౌరం చేయబడుతుంది.
19
“ ‘వారు తమ వెండిని వీధుల్లో పారేస్తారు, వారి బంగారం అపవిత్రంగా పరిగణించబడుతుంది. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని రక్షించలేవు. వారు పాపంలో పడడానికి అవి కారణంగా ఉన్నందుకు వాటివలన వారి ఆకలి తీరదు వారి కడుపు నిండదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options