Skip to content
యెహెజ్కేలు 7:5-13

యెహెజ్కేలు 7:5-13

5
“ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: “ ‘విపత్తు! విపత్తు వెనకే విపత్తు చూడండి, అది వచ్చేస్తుంది!
6
అంతం వచ్చేసింది! అంతం వచ్చేసింది! అది నీ కోసమే చూస్తుంది; ఇదిగో, వచ్చింది.
7
దేశ నివాసులారా! మీ మీదికి వినాశనం వస్తుంది. సమయం దగ్గరకి వచ్చింది! ఆ రోజు సమీపంగా ఉంది! ఆనందం కాదు భయమే పర్వతాలమీద వినపడుతుంది.
8
నా ఉగ్రత మీపై కుమ్మరించబోతున్నాను. నా కోపాన్ని మీమీద చూపిస్తాను. మీ ప్రవర్తనకు మీరు చేసిన అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను.
9
మీమీద ఏమాత్రం దయ చూపించను; మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రవర్తనకు, మీ మధ్య ఉన్న అసహ్యకరమైన ఆచారాలన్నిటికి మీకు ప్రతిఫలమిస్తాను. “ ‘అప్పుడు యెహోవానైన నేనే మిమ్మల్ని శిక్షిస్తున్నానని మీరు తెలుసుకుంటారు.’
10
“ ‘ఇదిగో ఆ రోజు! అది వచ్చేస్తుంది! నాశనం బయలుదేరి వచ్చేసింది దండం వికసించింది. గర్వం చిగురించింది.
11
బలాత్కారం మొదలై దుష్టులను శిక్షించే దండం అయింది. ప్రజల్లో గాని వారి గుంపులో గాని, ఆస్తిలో గాని, వారి ప్రఖ్యాతిలో గాని ఏదీ మిగల్లేదు.
12
ఆ సమయం వచ్చింది! ఆ రోజు వచ్చింది! ఆ గుంపు అంతటి మీద నా ఉగ్రత ఉంది. కాబట్టి కొనేవాడు సంతోష పడనక్కరలేదు అమ్మే వానికి దుఃఖ పడనక్కరలేదు.
13
అమ్మినవాడు కొన్న వాడు జీవించి ఉన్నంత కాలం అమ్మినవాడు తాను అమ్మిన దానిని తిరిగిపొందడు. ఈ దర్శనం ఆ గుంపు అంతటికి సంబంధించినది అది తప్పక నెరవేరుతుంది. వారి పాపాల కారణంగా వారిలో ఎవరూ తమ ప్రాణాలను రక్షించుకోలేడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options