Skip to content
యెహెజ్కేలు 44:17-27

యెహెజ్కేలు 44:17-27

17
“ ‘వారు లోపలి ఆవరణపు గుమ్మాల్లోకి ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరించాలి; లోపలి ఆవరణపు గుమ్మాల్లో గాని మందిరం లోపల గాని సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు వేసుకోకూడదు.
18
తలకు నార తలపాగా ధరించి నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదీ ఏదీ వారు ధరించకూడదు.
19
ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి.
20
“ ‘వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగకుండ వాటిని కత్తిరించాలి.
21
లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజకుడు ద్రాక్షరసం త్రాగకూడదు.
22
యాజకులు విధవరాండ్రను గాని, విడాకులు తీసుకున్న స్త్రీని గాని పెళ్ళి చేసుకోకూడదు. వారు కేవలం ఇశ్రాయేలు కన్యలను గాని యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారిని గాని పెళ్ళి చేసుకోవచ్చు.
23
అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.
24
“ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.
25
“ ‘యాజకుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తనను తాను అపవిత్రం చేసుకోకూడదు; చనిపోయిన వ్యక్తి తన తండ్రి తల్లి కుమారుడు కుమార్తె సోదరుడు లేదా పెళ్ళికాని సోదరి అయితే శవాన్ని ముట్టుకొని అతడు అపవిత్రం కావచ్చు.
26
అయితే అతడు శుద్ధి చేయబడిన తర్వాత, అతడు ఏడు రోజులు వేచి ఉండాలి.
27
పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options