Skip to content
యెహెజ్కేలు 27:26-36

ఓడ నాశనము మరియు ప్రపంచ విలాపము

యెహెజ్కేలు 27:26-36
26
నీ తెడ్లు నడిపేవారు మహా సముద్రంలోకి నిన్ను తీసుకెళ్లారు. కాని తూర్పు గాలి వీచి సముద్రం మధ్యలో నిన్ను నాశనం చేస్తుంది.
27
అప్పుడు నీ సంపద, సరుకులు వస్తువులు, నీ నావికులు, ఓడ నాయకులు నీ ఓడలు బాగుచేసేవారు, నీ వ్యాపారులు నీ సైనికులందరూ, నీతో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ఓడ ధ్వంసమైన రోజున సముద్రం మధ్యలో మునిగిపోతారు.
28
నీ నావికులు వేసే కేకలకు తీరప్రాంతాలు కంపిస్తాయి.
29
తెడ్డు నడిపే వారందరూ నావికులు, ఓడ నాయకులు తమ ఓడల మీద నుండి దిగివచ్చి తీరాన నిలబడతారు.
30
వారంతా గొంతెత్తి నీ గురించి ఏడుస్తారు; తమ తలలపై బూడిద చల్లుకుని బూడిదలో దొర్లుతారు.
31
నీ గురించి వారు తమ తలలు గొరిగించుకుని గోనెపట్టలు కట్టుకుని తీవ్రమైన దుఃఖంతో నీ గురించి ఏడుస్తారు;
32
వారు నీ గురించి ఏడుస్తూ విలాప గీతం పాడతారు: “సముద్రం మధ్యలో మునిగిపోయిన తూరు పట్టణమా! నీకు సాటియైన పట్టణమేదీ?”
33
సముద్రం మీద నీ వస్తువులు తీసుకెళ్తూ, అనేకమందిని తృప్తిపరిచావు; నీ విస్తారమైన సంపదతో నీ వ్యాపార వస్తువులతో భూరాజులను ఐశ్వర్యవంతులను చేశావు.
34
ఇప్పుడు లోతైన జలాల్లో మునిగి సముద్రంలో నాశనమయ్యావు; నీ వస్తువులు నీ సహచరులు నీతో పాటే మునిగిపోయారు.
35
తీరప్రాంతాలలో ఉన్నవారంతా నీ గురించి దిగులుపడతారు; వారి రాజులు వణకుతారు. వారి ముఖాలు చిన్నబోయాయి.
36
వివిధ ప్రజల మధ్యలో వర్తకులు నిన్ను ఎగతాళి చేస్తారు. నీవు భయంకరమైన ముగింపుకు వచ్చావు, పూర్తిగా నాశనం అవుతావు.’ ”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options