Skip to content
నిర్గమకాండము 39:36-43

నిర్గమకాండము 39:36-43

36
బల్ల, దాని ఉపకరణాలన్నీ, సన్నిధి రొట్టెలు;
37
మేలిమి బంగారు దీపస్తంభం, దాని దీపాల వరుస, దాని ఉపకరణాలన్నీ, వెలిగించడానికి ఒలీవనూనె;
38
బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ద్వారానికి తెర;
39
ఇత్తడి బలిపీఠం, దాని ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు దాని పాత్రలన్నీ; ఇత్తడి గంగాళం, దాని పీట;
40
ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దిమ్మలు, ఆవరణ ద్వారానికి తెర; ఆవరణానికి మేకులు, వాటి త్రాళ్లు; సమావేశ గుడారంలో సేవకు ఉపయోగించే అన్ని ఉపకరణాలు;
41
పరిశుద్ధాలయంలో పరిచర్య చేయడానికి ధరించే నేసిన వస్త్రాలు; యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు అతని కుమారులకు వస్త్రాలు.
42
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.
43
మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options