నిర్గమకాండము 37:10-14
10
వారు తుమ్మకర్రతో ఒక బల్లను చేశారు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు ఒకటిన్నర మూర.
11
తర్వాత వారు దాన్ని స్వచ్ఛమైన బంగారంతో పొదిగించి దాని చుట్టూ బంగారు అంచును చేశారు.
12
అలాగే దాని చుట్టూ బెత్తెడు వెడల్పున చట్రం కూడా చేసి దానిపై బంగారంతో పొదిగించారు.
13
ఆ బల్లకు నాలుగు ఉంగరాలు చేసి వాటిని నాలుగు కాళ్లు ఉన్న నాలుగు మూలల్లో తగిలించారు.
14
బల్ల మోయడానికి ఉపయోగించే మోతకర్రలు ఉంచే ఉంగరాలు చట్రానికి దగ్గరగా పెట్టారు.
Settings