Skip to content
నిర్గమకాండము 3:16-22

పెద్దలకు ఆదేశాలు మరియు విమోచన సూచన

నిర్గమకాండము 3:16-22
16
“వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను.
17
ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.
18
“ఇశ్రాయేలీయుల పెద్దలు నీ మాట వింటారు. అప్పుడు నీవు వారితో కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పాలి.
19
అయితే ఈజిప్టు రాజు ఒక బలమైన హస్తం అతన్ని ఒత్తిడి చేస్తేనే తప్ప మిమ్మల్ని పోనివ్వడని నాకు తెలుసు.
20
కాబట్టి నేను నా చేతిని చాచి ఈజిప్టువారి మధ్య నేను చేయదలచిన అద్భుత కార్యాలను చేసి వారిని మొత్తుతాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
21
“ఈ ప్రజల పట్ల ఈజిప్టువారిలో దయను పుట్టిస్తాను కాబట్టి మీరు వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు.
22
ప్రతి స్త్రీ తన పొరుగువారిని వారి ఇంట్లో ఉండే స్త్రీని వెండి బంగారు ఆభరణాలను, బట్టలను అడిగి తీసుకుని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేయాలి. ఈ విధంగా మీరు ఈజిప్టువారిని కొల్లగొడతారు.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options