కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 14:1-4

ఇశ్రాయేలు శిబిర స్థలాన్ని దేవుడు నిర్దేశించుట

నిర్గమకాండము 14:1-4
1
తర్వాత యెహోవా మోషేతో అన్నారు,
2
“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.
3
ఫరో ఇశ్రాయేలీయుల గురించి, ‘వారు ఈ దేశంలో కలవరంతో దారితప్పి తిరుగుతున్నారని, ఎడారిలో చిక్కుకున్నారని’ అనుకుంటాడు.
4
నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను కాబట్టి అతడు వారిని వెంటాడుతాడు. కాని ఫరో, అతని సైన్యం వలన నాకు మహిమ కలుగుతుంది. నేను యెహోవానై యున్నానని ఈజిప్టువారందరు తెలుసుకుంటారు.” కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options