Skip to content
ఎఫెసీయులకు 5:3-20

ఎఫెసీయులకు 5:3-20

3
లైంగిక అపవిత్రత గాని లేదా ఇతర అపవిత్రత గాని అత్యాశ గాని మీ మధ్యలో ఎంత మాత్రం ఉండకూడదు, ఎందుకంటే ఇవి దేవుని పరిశుద్ధ ప్రజలకు తగినవి కావు.
4
దేవుని పట్ల కృతజ్ఞతగల మాటలనే మాట్లాడండి, మీలో బూతు మాటలకు, మూర్ఖపు లేదా పోకిరి మాటలకు చోటు ఉండకూడదు.
5
వ్యభిచారులు, అపవిత్రులు, అత్యాశపడేవారు అందరు విగ్రహారాధికులే; దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో వారికి వారసత్వం లేదని మీకు ఖచ్చితంగా తెలుసు.
6
వ్యర్థమైన మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, ఎందుకంటే వీటిని బట్టి అవిధేయులైనవారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది.
7
కాబట్టి అలాంటి వారితో మీరు భాగస్వాములుగా ఉండకండి.
8
ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి,
9
ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది.
10
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి.
11
నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.
12
అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.
13
కాని వెలుగుచేత చూపించబడే ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది, ప్రకాశించే ప్రతిదీ వెలుగు అవుతుంది.
14
అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది.
15
చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి.
16
దినాలు చెడ్డవి కాబట్టి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
17
కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి.
18
మద్యంతో మత్తులు కాకండి, అది మిమ్మల్ని దుష్టత్వంలోనికి నడిపిస్తుంది. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి,
19
సంగీతములతో, కీర్తనలతో ఆత్మ సంబంధమైన పాటలతో, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. మీ హృదయాలతో పాటలు పాడుతూ సంగీతంతో ప్రభువును గురించి కీర్తిస్తూ,
20
ఎల్లప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మన తండ్రియైన దేవునికి అన్నిటి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options