ప్రసంగి 8:9-17
9
ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు.
10
పవిత్ర స్థలానికి తరచూ వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ నేరాలు చేశారో అదే పట్టణంలో పొగడబడతారు. అలాంటి దుర్మార్గులు సక్రమంగా పాతిపెట్టబడడం నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే.
11
చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు.
12
వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు.
13
దుర్మార్గులు దేవునికి భయపడరు కాబట్టి, వారు అభివృద్ధి చెందరు, వారి రోజులు నీడలా ధీర్ఘకాలం ఉండవు.
14
భూమిపై అర్థరహితమైనది మరొకటి ఉంది: దుర్మార్గులు పొందవలసిన దాన్ని నీతిమంతులు, నీతిమంతులు పొందవలసిన దాన్ని దుర్మార్గులు పొందుతున్నారు. ఇది కూడా అర్థరహితమే అని నేను చెప్తున్నాను.
15
కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే.
16
జ్ఞానాన్ని పొందడానికి, భూమిపై ప్రజలు పగలు రాత్రి నిద్రలేకుండ చేసే శ్రమను గమనించడానికి నేను నా మనస్సును నిలిపినప్పుడు
17
దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను.
Settings