Skip to content
ద్వితీయోపదేశకాండము 22:1-9

ద్వితీయోపదేశకాండము 22:1-9

1
మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.
2
ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.
3
గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.
4
మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.
5
స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
6
రోడ్డు ప్రక్కన, చెట్టు ప్రక్కన లేదా నేలపై పక్షుల గూడు కనిపిస్తే, తల్లి చిన్నపిల్లలపై లేదా గుడ్లపై కూర్చుంటే, తల్లిని పిల్లలతో తీసుకెళ్లవద్దు.
7
మీరు పిల్లలను తీసుకెళ్లవచ్చు, కాని తల్లిని వదిలేయాలి, తద్వార మీరు బాగుంటారు దీర్ఘాయువు కలిగి ఉంటారు.
8
మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.
9
మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options