Skip to content
దానియేలు 2:19-24

దానియేలు 2:19-24

19
ఆ రాత్రివేళ దానియేలుకు దర్శనం ద్వారా ఆ మర్మం తెలియజేయబడింది. అప్పుడు దానియేలు పరలోక దేవున్ని స్తుతిస్తూ,
20
ఇలా అన్నాడు: “దేవుని నామానికి ఎల్లప్పుడు స్తుతి కలుగును గాక; జ్ఞానం, శక్తి ఆయనకే చెందుతాయి.
21
ఆయన కాలాలను, రుతువులను మారుస్తారు; ఆయన రాజులను కూలగొట్టి ఇతరులను నియమిస్తారు. ఆయన జ్ఞానులకు జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని ఇస్తారు.
22
ఆయన లోతైన విషయాలను, రహస్యాలను బయలుపరుస్తారు; చీకటిలో ఉన్నది ఆయనకు తెలుసు, వెలుగు ఆయనతో నివసిస్తుంది.
23
నా పూర్వికుల దేవా, నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను: మీరు నాకు జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు, మేము మిమ్మల్ని అడిగింది మీరు నాకు తెలియజేశారు, రాజు కలను మీరు మాకు తెలియజేశారు.”
24
అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపమని రాజు నియమించిన అర్యోకు దగ్గరకు వెళ్లి అతనితో, “బబులోను జ్ఞానులను చంపకండి. నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్లండి, నేను అతని కల భావం అతనికి తెలియజేస్తాను” అన్నాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options