2 రాజులు 23:23-27
23
అయితే యోషీయా రాజు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో యెరూషలేములో ఈ పస్కా పండుగ యెహోవాకు జరిగింది.
24
అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.
25
అతడు పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు కాని అతని తర్వాత కాని, అతనిలాంటి రాజు ఎవరూ లేరు.
26
అయినా యెహోవాకు యూదా మీద ఉన్న మహా కోపం తగ్గలేదు, ఎందుకంటే మనష్షే చేసినదంతటిని బట్టి ఆయన కోపం రగులుకుంది.
27
కాబట్టి యెహోవా అన్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టు యూదా ప్రజలను కూడా నా సముఖంలో లేకుండా చేస్తాను. నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని, ‘నా పేరు అక్కడ ఉంటుంది’ అని చెప్పిన మందిరాన్ని విసర్జిస్తాను” అన్నారు.
Settings