Skip to content
2 రాజులు 18:1-5

2 రాజులు 18:1-5

1
ఇశ్రాయేలు రాజు, ఏలా కుమారుడైన హోషేయ పరిపాలన యొక్క మూడవ సంవత్సరంలో యూదారాజు, ఆహాజు కుమారుడైన హిజ్కియా పరిపాలన ప్రారంభించాడు.
2
అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె.
3
అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
4
అతడు క్షేత్రాలను తొలగించి, పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు, ఎందుకంటే ఆ కాలం వరకు ఇశ్రాయేలీయులు దానికి ధూపం వేసేవారు. (అది నెహుష్టాను అని పిలువబడేది.)
5
హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు నమ్మకం ఉంచాడు. అతని ముందు గాని అతని తర్వాత గాని వచ్చిన యూదా రాజులలో, ఎవరూ అతని వంటివారు లేరు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options