2 కొరింథీయులకు 2:1-4
1
కాబట్టి నేను దుఃఖం కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను.
2
ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, నేను దుఃఖంలో విడిచిపెట్టిన వారు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెట్టగలరు?
3
కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకము.
4
ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.
Settings