2 కొరింథీయులకు 10:1-6
1
క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాన్ని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.”
2
ఈ లోక పద్ధతులతో మేము జీవిస్తున్నామని భావించే కొందరితో ధైర్యంగా వ్యవహరించాలని అనుకుంటున్నాను, కాని నేను అక్కడికి వచ్చినప్పుడు అలా జరగకుండా ఆపాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను.
3
మేము ఈ లోకంలో జీవించినా ఈ లోకంలా మేము పోరాటం చేయము.
4
మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.
5
వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.
6
మీ విధేయత సంపూర్ణమైన తర్వాత అవిధేయతనంతటిని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
Settings