కంటెంట్‌కు వెళ్లండి
2 దినవృత్తాంతములు 3:8-14

అతి పరిశుద్ధ స్థలము మరియు కెరూబులు

2 దినవృత్తాంతములు 3:8-14
8
అతడు మందిరంలో అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. మందిరం వెడల్పు బట్టి దాని పొడవు ఇరవై మూరలు. వెడల్పు కూడా ఇరవై మూరలు. దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. అందుకు సుమారు 20,000 కిలోగ్రాముల బంగారం పట్టింది.
9
బంగారు మేకు బరువు యాభై షెకెళ్ళు, మందిర పైభాగాలను కూడా బంగారంతో పొదిగించాడు.
10
అతి పరిశుద్ధ స్థలంలో రెండు కెరూబులను చెక్కించాడు. వాటిని బంగారంతో పొదిగించాడు.
11
ఆ కెరూబులకు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కల పొడవు మొత్తం ఇరవై మూరలు. ఒక్కొక్క రెక్క అయిదు మూరల పొడవు మొదటి రెక్క గోడకు తాకుతూ ఉంది. రెండవ రెక్క దానికి జతగా ఉన్న కెరూబు తాకుతూ ఉంది.
12
అదే విధంగా రెండవ కెరూబు ఒక రెక్క అయిదు మూరల పొడవు. అది ఆలయ గోడకు తాకుతూ ఉంది. దాని మరొక రెక్క అయిదు మూరల పొడవు, మొదటి కెరూబు రెక్కను తాకుతూ ఉంది.
13
ఆ విధంగా ఆ కెరూబుల రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. కెరూబుల ముఖాలు ప్రధాన మందిరం వైపుకు తిరిగి ఉన్నాయి. కెరూబులు కాళ్లమీద నిలబడి ఉన్నాయి.
14
సొలొమోను నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో సన్నని నారతో ఒక తెరను చేయించి దానిమీద కెరూబులను అల్లించాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options