Skip to content
1 సమూయేలు 27:3-7

1 సమూయేలు 27:3-7

3
దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు.
4
దావీదు గాతుకు పారిపోయాడని సౌలుకు తెలిసిన తర్వాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
5
అప్పుడు దావీదు ఆకీషుతో, “రాజనగరంలో నీతో పాటు నీ సేవకుడనైన నేను ఉండడం ఎందుకు? నీకు నాపై దయ ఉంటే నేను నివసించడానికి బయట పట్టణాల్లో ఒకదానిలో నాకు స్థలం ఇవ్వండి” అని అడిగాడు.
6
కాబట్టి ఆకీషు ఆ రోజే సిక్లగు అనే పట్టణాన్ని అతనికిచ్చాడు. అప్పటినుండి నేటివరకు సిక్లగు యూదా రాజులకు చెందినదిగానే ఉంది.
7
దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options