Skip to content
1 రాజులు 4:24-34

1 రాజులు 4:24-34

24
అతడు యూఫ్రటీసు నదికి పడమరగా, తిఫ్సహు నుండి గాజా వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించాడు. ఆ సమయంలో అన్ని వైపుల నెమ్మది ఉండింది.
25
సొలొమోను జీవితకాలంలో దాను నుండి బెయేర్షేబ వరకు యూదా, ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా, ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద నిర్భయంగా నివసించారు.
26
సొలొమోను రథాల కోసం వాటిని లాగే గుర్రాల కోసం నాలుగువేల గుర్రపు శాలలు, పన్నెండు వేల రథసారధులు ఉన్నారు.
27
జిల్లా అధికారులు ఒక్కొక్కరు తమకు నియమించిన నెలలో రాజైన సొలొమోనుకు, అతని బల్ల దగ్గర కూర్చునే అందరికి ఏ కొరత లేకుండ ఆహారపదార్థాలు సరఫరా చేసేవారు.
28
అంతేకాక, రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న చోట్లకు తమకు నిర్ణయించబడిన ప్రకారం యవలను, ఎండు గడ్డిని తెచ్చేవారు.
29
దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు.
30
సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది.
31
అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది.
32
అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు.
33
అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు.
34
అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options