1 రాజులు 20:1-6
1
తర్వాత అరాము రాజైన బెన్-హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకున్నాడు. అతనితో ముప్పై రెండు మంది రాజులు తమ గుర్రాలు రథాలతో ఉన్నారు. అతడు వచ్చి సమరయను ముట్టడించి దాడి చేశాడు.
2
అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు దూతలను పంపి, “బెన్-హదదు చెప్పేది ఇదే: ‘నీ వెండి బంగారాలు నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో ఉత్తమమైన వారు నా వారే’ ” అని కబురు పంపాడు.
4
అందుకు ఇశ్రాయేలు రాజు, “నా ప్రభువా, రాజా, మీరు చెప్పినట్టే నేనూ, నాకు కలిగినదంతా మీ వశంలో ఉన్నాం” అని జవాబిచ్చాడు.
5
తర్వాత బెన్-హదదు దూతలు తిరిగివచ్చి ఇలా చెప్పారు: “బెన్-హదదు చెప్పేదేంటంటే, ‘నీ వెండిని, నీ బంగారాన్ని, నీ భార్యలను, నీ పిల్లలను నా స్వాధీనం చేయాలని నేను కబురు పంపాను.
6
అయితే రేపు ఇదే వేళకు, నా సేవకులను నీ దగ్గరకు పంపిస్తాను. వారు నీ రాజభవనాన్ని, నీ అధికారుల ఇళ్ళను వెదుకుతారు, నీకు విలువైన ప్రతిదాన్ని వారు తీసుకెళ్తారు.’ ”
Settings