కంటెంట్‌కు వెళ్లండి
1 దినవృత్తాంతములు 18:14-17

దావీదు పరిపాలన మరియు అధికారులు

1 దినవృత్తాంతములు 18:14-17
14
దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు.
15
సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి;
16
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; షవ్షా కార్యదర్శి;
17
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి; దావీదు కుమారులు రాజు ప్రధాన అధికారులు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options