Skip to content

Zedekiah గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెహోయాకీము వారసులు: యెహోయాకీను, అతని సోదరుడు సిద్కియా.

  2. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా, నా పేరిట మీకు అబద్ధాలు ప్రవచిస్తున్న కోలాయా కుమారుడైన అహాబు, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను, అతడు మీ కళ్లముందే వారిని చంపేస్తాడు.

  3. వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు.

  4. ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు.

  5. అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.