కంటెంట్‌కు వెళ్లండి

Worship గురించి బైబిల్ వచనాలు: Loved by His people

6 వచనాలు · 14 కోణాలు

"Worship" కోసం వెతకండి

Loved by His people గురించి వచనాలు

  1. యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను.

  2. సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!

  3. యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.

  4. సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, మీ బలిపీఠం దగ్గరే, పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కోయిలకు గూడు దొరికింది, అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.

  5. బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.

  6. ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు.