Weaving గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
దాని మధ్యలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చిరిగిపోకుండా మెడపట్టీలా దాని అంచుల చుట్టూ అల్లికపని చేయాలి.
చెక్కేవారి పని, కళాకారుల పని, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో కుట్టుపని, నేతగాని పని, చిత్రకారులు చేయగల అన్ని రకాల పనులను చేయడానికి కావలసిన నైపుణ్యంతో యెహోవా వారిని నింపారు.
వారు ఏఫోదు నిలువుటంగీని ఒక నేత పనిలా పూర్తిగా నీలి బట్టతో తయారుచేసి,
వారు అహరోనుకు అతని కుమారులకు సన్నని నారబట్టతో చొక్కా నేసారు.
మేకు పెట్టి బిగించింది. అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు.
గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.
అతడు యెహోవా మందిరంలో ఉన్న పురుష వ్యభిచారుల గదులను పడగొట్టించాడు, అక్కడ స్త్రీలు అషేరాకు వస్త్రాలను అల్లేవారు.
అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు.
“నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి, నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి.
దువ్వెనతో చిక్కుతీసి జనపనారతో పని చేసేవారు నిరాశపడతారు, సన్నని నారతో అల్లేవారు నిరీక్షణ కోల్పోతారు.
గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.