Skip to content

Wagon గురించి బైబిల్ వచనాలు: General references

9 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

  1. “ఇలా కూడ చెప్పమని ఆదేశిస్తున్నాను, ‘మీరు ఇలా చేయండి: మీ పిల్లలు, మీ భార్యల కోసం ఈజిప్టు నుండి కొన్ని బండ్లను తీసుకెళ్లండి, మీ తండ్రిని తీసుకురండి.

  2. అయితే యోసేపు తమతో చెప్పిందంతా వారు అతనికి చెప్పి, యోసేపు తనను తీసుకెళ్లడానికి పంపిన బండ్లను చూసినప్పుడు, తమ తండ్రియైన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది.

  3. వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.

  4. యెహోవా మోషేతో,

  5. “సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.”

  6. కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు.

  7. అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు,

  8. అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు.

  9. కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు.