Timbrel గురించి బైబిల్ వచనాలు: Used in religious service
Used in religious service గురించి వచనాలు
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, దేవదారు కర్రతో చేసిన చిరతలు, సితారలు, వీణలు, తంబురలు, డప్పులు, తాళాలు వాయిస్తూ తమ శక్తి అంతటితో యెహోవా ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
దావీదు, ఇశ్రాయేలీయులందరు పాటలు పాడుతూ, సితారలు, వీణలు, తంబురలు, తాళాలు, బూరలు వాయిస్తూ తమ శక్తి అంతటితో దేవుని ఎదుట ఉత్సహిస్తూ ఉన్నారు.
ముందు గాయకులు, తర్వాత సంగీతకారులు; వారితో ఉన్నారు కంజరలు వాయిస్తున్న యవ్వన స్త్రీలు.
సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. మధురంగా సితారా వీణ మీటండి.
వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు.
కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.