Skip to content

Theocracy గురించి బైబిల్ వచనాలు: Established

14 వచనాలు · 2 కోణాలు

Established గురించి వచనాలు

  1. ప్రజలంతా కలిసి స్పందించి, “యెహోవా చెప్పిందంతా మేము చేస్తాము” అని అన్నారు. అప్పుడు మోషే వారి సమాధానాన్ని యెహోవా దగ్గరకు తీసుకెళ్లాడు.

  2. మోషే వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని, చట్టాలను ప్రజలకు చెప్పినప్పుడు వారందరు ఏకకంఠంతో, “యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని మేము చేస్తాం” అన్నారు.

  3. తర్వాత అతడు ఒడంబడిక గ్రంథాన్ని తీసుకుని ప్రజలకు చదివి వినిపించాడు. అప్పుడు వారు, “యెహోవా ఆజ్ఞాపించినవన్నీ మేము చేస్తాము; వాటికి లోబడి ఉంటాం” అని చెప్పారు.

  4. అయితే ఇప్పుడు మేమెందుకు చావాలి? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడైన యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చనిపోతాము.

  5. మేము విన్నట్లు మానవులలో ఎవరైనా సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని బ్రతికి ఉన్నారా?

  6. నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.”

  7. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నారు, యెహోవా నాతో ఇలా అన్నారు, “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే.

  8. వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది.

  9. అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.

  10. నిజంగా ఆయన తన జనులను ప్రేమిస్తున్నారు; పరిశుద్ధులందరు మీ చేతిలో ఉన్నారు. వారు మీ పాదాల దగ్గర వంగి, మీ నుండి ఉపదేశాన్ని పొందుకుంటారు,

  11. మోషే మనకు ఇచ్చిన ధర్మశాస్త్రం యాకోబు సమాజానికి స్వాస్థ్యము.

  12. ప్రజల నాయకులు, ఇశ్రాయేలు గోత్రాలతో పాటు సమావేశమైనప్పుడు ఆయన యెషూరూనుకు రాజుగా ఉన్నాడు.

  13. అయితే గిద్యోను వారితో, “నేను మిమ్మల్ని పాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పాలించడు. యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తారు” అన్నాడు.

  14. “అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి రావడం మీరు చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా మీకు రాజుగా ఉన్నప్పటికీ, ‘ఆయన కాదు, మమ్మల్ని పాలించడానికి ఒక రాజు మాకు కావాలని’ మీరు నాతో చెప్పారు.