Skip to content

The Horse గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెజ్రెయేలు గోపురం మీద నిలుచున్న కావలివాడు యెహు, అతని సైనికుల గుంపు రావడం చూసి, “నాకు సైనికులు కొంతమంది వస్తున్నట్లు కనిపిస్తుంది” అని బిగ్గరగా అరిచాడు. అందుకు యెహోరాము, “ఒక రౌతును పిలిపించి, వారిని కలవడానికి పంపించు, అతడు వారితో, ‘సమాధానంగా వస్తున్నారా?’ అని అడుగు” అని ఆదేశించాడు.

  2. ఆ గుర్రాన్ని స్వారీ చేసేవాడు యెహుకు ఎదురుగా వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నారు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” “సమాధానంతో నీకేం పని?” అని యెహు జవాబిచ్చాడు. “నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు.” కావలివాడు, “ఆ దూత వారిని చేరుకున్నాడు, కాని అతడు తిరిగి రావడం లేదు” అని చెప్పాడు.

  3. కాబట్టి రాజు ఇంకొక గుర్రపురౌతును పంపించాడు. అతడు వారి దగ్గరకు వెళ్లి, “రాజు ఇలా అడుగుతున్నాడు: ‘మీరు సమాధానంతో వస్తున్నారా?’ ” అని అన్నాడు. అందుకు యెహు, “సమాధానంతో నీకేం పని? నా వెనుకకు వచ్చి నన్ను వెంబడించు” అన్నాడు.

  4. రాజు ధరించుకునే రాజవస్ర్తాలను, రాజు స్వారీ చేసే గుర్రాన్ని, రాజు తలమీద పెట్టుకునే రాజకిరీటాన్ని తీసుకురావాలి.

  5. తర్వాత ఆ రాజవస్త్రాన్ని ఆ గుర్రాన్ని రాజు యొక్క అత్యంత ఘనులైన ఓ అధిపతికి అప్పగించాలి. రాజు సన్మానించాలని అనుకున్న ఆ వ్యక్తికి ఆ రాజ వస్త్రం వేయించి ఆ గుర్రం మీద నగర వీధుల్లో త్రిప్పుతూ, ‘రాజు ఒక వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఆ వ్యక్తికి ఇలా చేయబడుతుంది!’ అని అంటూ ఆ వ్యక్తి ఎదుట చాటాలి” అని అన్నాడు.

  6. అందుకు రాజు, “త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు” అని హామానుకు ఆజ్ఞాపించాడు.

  7. కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.