The High Priest గురించి బైబిల్ వచనాలు: Interceding
Interceding గురించి వచనాలు
అప్పుడు మోషే, అహరోనులు సమావేశ గుడారం ముందుకు వెళ్లారు.
యెహోవా మోషేతో,
“మీరు సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెంటనే వారిని చంపేస్తాను” అన్నారు. అప్పుడు వారు సాష్టాంగపడ్డారు.
అప్పుడు మోషే అహరోనుతో, “నీ ధూపార్తిని తీసుకుని దానిలో ధూపం వేసి, బలిపీఠం నుండి మండుతున్న బొగ్గును తీసుకుని వారికి ప్రాయశ్చిత్తం చేయడానికి సమాజం దగ్గరకు త్వరగా వెళ్లు. యెహోవా నుండి కోపం రగులుతూ వస్తుంది; తెగులు ప్రారంభమైంది” అన్నాడు.
మోషే చెప్పినట్లే అహరోను చేశాడు. ధూపార్తులతో సమాజం మధ్యకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అప్పటికే ప్రజల్లో తెగులు మొదలయ్యింది కానీ అహరోను ధూపం వేసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
మృతులకు, జీవులకు మధ్య అతడు నిలిచాడు, తెగులు ఆగిపోయింది.