The Excellency and Glory of Christ గురించి బైబిల్ వచనాలు: In his triumph
In his triumph గురించి వచనాలు
రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”
నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కేవాని బట్టల్లా ఎర్రగా ఎందుకు ఉన్నాయి?
“నేను ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కాను; దేశాల్లో ఏ ఒక్కరూ నాతో లేరు. నా కోపంలో వారిని త్రొక్కివేశాను నా ఉగ్రతలో వారిని అణగద్రొక్కాను; వారి రక్తం నా బట్టలమీద చిందింది, నా బట్టలన్నిటికి మరకలయ్యాయి.