Skip to content

The Ephod గురించి బైబిల్ వచనాలు

12 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “రెండు లేతపచ్చ రాళ్లు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు కుమారుల పేర్లు, వారు పుట్టిన క్రమం ప్రకారం ఒక రాయి మీద ఆరు పేర్లు మరొకదాని మీద మిగిలిన ఆరు పేర్లు చెక్కాలి.

  2. Six of their names on one stone, and the other six names of the rest on the other stone, according to their birth.

  3. ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి.

  4. తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించాలి. యెహోవా ఎదుట జ్ఞాపకంగా అహరోను తన భుజాలమీద ఆ పేర్లను మోయాలి.

  5. గొలుసుల యొక్క ఇతర చివరలను రెండు జవలకు, ముందు భాగంలో ఉన్న ఏఫోదు యొక్క భుజాలకు జోడించాలి.

  6. రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి, వాటిని ఏఫోదు ముందు భాగంలో రొమ్ము పతకానికి లోపలి అంచున ఉన్న రెండు చివర్లకు జోడించాలి.

  7. మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించాలి.

  8. అప్పుడు రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టాలి.

  9. సౌలు తనకు కీడు చేయాలని కుట్ర చేస్తున్నాడని తెలుసుకున్న దావీదు యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదు తీసుకురా” అని చెప్పాడు.

  10. అప్పుడు దావీదు, “ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నా కారణంగా పట్టణాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నాడని మీ దాసుడనైన నాకు ఖచ్చితంగా తెలిసింది.

  11. కెయీలా పౌరులు నన్ను అతని చేతికి అప్పగిస్తారా? మీ సేవకుడనైన నేను విన్నట్లుగా సౌలు వస్తాడా? ఇశ్రాయేలీయుల దేవుడవైన యెహోవా, దయచేసి మీ సేవకుడనైన నాకు చెప్పండి” అని ప్రార్థించాడు. “అతడు వస్తాడు” అని యెహోవా జవాబిచ్చారు.

  12. దావీదు మరల, “కెయీలా పౌరులు నన్ను నా ప్రజలను సౌలు చేతికి అప్పగిస్తారా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వారు నిన్ను అప్పగిస్తారు” అని జవాబిచ్చారు.