కంటెంట్‌కు వెళ్లండి

Smith గురించి బైబిల్ వచనాలు: Bezaleel

11 వచనాలు · 6 కోణాలు

"Smith" కోసం వెతకండి

Bezaleel గురించి వచనాలు

  1. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  2. “చూడు, నేను యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  3. నేను అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో అన్ని రకాల నైపుణ్యతలతో నింపాను.

  4. అతడు బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను తయారుచేస్తాడు.

  5. ఇంకా అతడు రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం, అలా అన్ని రకాల చేతిపనులు చేస్తాడు.

  6. అంతేకాక అతనికి సహాయం చేయడానికి దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబును నేను నియమించాను.

  7. “ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం, దాని మీద ఉండే ప్రాయశ్చిత్త మూత, గుడారంలోని ఇతర ఉపకరణాలు

  8. బల్ల, దానిమీది ఉపకరణాలు, స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం, దాని ఉపకరణాలు, ధూపవేదిక,

  9. దహనబలిపీఠం దాని పాత్రలు, ఇత్తడి గంగాళం దాని ఇత్తడి పీట;

  10. అంతేకాక యాజక సేవ చేసేటప్పుడు ధరించడానికి నేసిన వస్త్రాలు, యాజకుడైన అహరోనుకు పవిత్ర వస్త్రాలు, అలాగే అతని కుమారులకు వస్త్రాలు వారు యాజకులుగా పరిచర్య చేస్తున్నప్పుడు వేసుకోడానికి,

  11. పరిశుద్ధస్థలం కోసం అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపము.