Skip to content

Sinlessness గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు.

  2. కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.

  3. దేవునికి మహిమ స్తోత్రం కలుగుటకు, మీరు ఏది ఉత్తమమైనదో గ్రహించ కలిగి క్రీస్తు దినాన మీరు స్వచ్ఛముగా, నిర్దోషులుగా ఉండేలా, మీ ప్రేమ, జ్ఞానంలో, లోతైన పరిజ్ఞానాన్ని కలిగి అంతకంతకు వృద్ధిచెందాలని, క్రీస్తు యేసు నుండి వచ్చే నీతిఫలంతో మీరు నింపబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.

  4. That ye may approve things that are excellent; that ye may be sincere and without offence till the day of Christ;

  5. Being filled with the fruits of righteousness, which are by Jesus Christ, unto the glory and praise of God.

  6. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.

  7. సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.

  8. క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, కాబట్టి మీరు అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు.

  9. కాబట్టి ఇప్పటినుండి మీరు ఈ లోకంలో మిగిలిన జీవితకాలాన్ని మానవ ఆశలను అనుసరించడానికి కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి.

  10. ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు.

  11. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే, మనం ఆయనను అబద్ధికుని చేస్తాము; మనలో ఆయన వాక్యం లేదు.

  12. ఆయనలో జీవించేవారు ఎవరూ పాపంలో కొనసాగరు. పాపంలో కొనసాగేవారు ఆయనను ఎన్నడూ చూడలేదు తెలుసుకోలేదు.

  13. దేవుని వలన పుట్టిన ప్రతివారిలో ఆయన బీజం నిలిచి ఉంటుంది; కాబట్టి వారు పాపంలో కొనసాగరు. వారు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపం చేయలేరు.