Skip to content

Shekel గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. లెక్కించబడినవారిలో చేరే ప్రతి ఒక్కరు పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం అర షెకెల్ ఇవ్వాలి, దాని బరువు ఇరవై గెరాలు ఉంటుంది. ఈ అర షెకెల్ యెహోవాకు కానుక.

  2. పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి.

  3. వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

  4. అతడు ఆమె తండ్రికి యాభై షెకెళ్ళ వెండి చెల్లించాలి. అతడు ఆ యువతిని అవమానించాడు కాబట్టి ఆమెను పెళ్ళి చేసుకోవాలి. అతడు బ్రతికున్నంత కాలం ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

  5. ఆ సేవకుడు మళ్ళీ సౌలుతో, “చూడండి, నా దగ్గర పావు షెకెల్ వెండి ఉంది. మనం వెళ్లవలసిన దారిని మనకు చెప్పడానికి దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.

  6. “మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము.

  7. ఒక షెకెలుకు ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు సమానము.

  8. అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,