Skip to content

Scab గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.

  2. ఏడవ రోజు యాజకుడు వారిని మళ్ళీ పరీక్షించాలి, పుండు క్షీణించి, చర్మంలో వ్యాపించకపోతే, యాజకుడు వారిని శుభ్రంగా ప్రకటించాలి; ఇది దద్దుర్లు మాత్రమే. వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు శుభ్రంగా అవుతారు.

  3. కాని వారు శుద్ధులని ప్రకటించబడడానికి యాజకునికి కనుపరచుకున్న తర్వాత దద్దుర్లు చర్మంలో వ్యాపిస్తే వారిని తిరిగి యాజకుని దగ్గరకు రావాలి.

  4. యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షించాలి, ఒకవేళ దద్దుర్లు చర్మంలో వ్యాపించి ఉంటే, అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి; అది కుష్ఠువ్యాధి.

  5. వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా,

  6. గూనివారు గాని మరుగుజ్జులు గాని కంటి లోపం ఉన్నవారు గాని గజ్జి ఉన్నవారు గాని చీము కారుతున్న పుండ్లతో ఉన్నవారు గాని వరిబీజములు పాడైనవారు గాని సమీపంగా రాకూడదు.

  7. యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు.

  8. యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు.

  9. కాబట్టి ప్రభువు సీయోను స్త్రీల తలలపై పుండ్లు పుట్టిస్తారు; యెహోవా వారి తలల్ని బోడి చేస్తారు.”