కంటెంట్‌కు వెళ్లండి

Responsive Religious Service గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:

  2. “శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  3. “తండ్రిని గాని తల్లిని గాని అవమానపరచే వారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  4. “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  5. “గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  6. “విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  7. “తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  8. “ఏ జంతువుతోనైనా లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  9. “తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  10. “అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  11. “పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  12. “నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.

  13. “ఈ ధర్మశాస్త్రంలోని మాటలను అమలు చేయడం ద్వారా వాటిని పాటించనివారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.