కంటెంట్‌కు వెళ్లండి

Pashur గురించి బైబిల్ వచనాలు: 2. Son of Immer and governor of the temple. Beats and imprisons Jeremiah

6 వచనాలు · 2 కోణాలు

2. Son of Immer and governor of the temple. Beats and imprisons Jeremiah గురించి వచనాలు

  1. యిర్మీయా ఈ విషయాలు ప్రవచించడం ఇమ్మేరు కుమారుడు, యాజకుడు, యెహోవా ఆలయానికి అధికారియైన పషూరు విని,

  2. అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.

  3. మరుసటిరోజు, పషూరు అతన్ని కొయ్య నుండి విడిపించినప్పుడు, యిర్మీయా అతనితో, “నీకు యెహోవా ఇచ్చిన పేరు పషూరు కాదు, నీ పేరు మాగోర్-మిస్సాబీబు.

  4. ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు.

  5. నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు.

  6. పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ”